కేటీఆర్‌కు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆహ్వానం సెప్టెంబర్ 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్-2017 సమావేశానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. కేంద్ర కమ్యూనికేషన్‌స శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ మేరకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తొలిసారిగా కేంద్రం నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మొబైల్ కాంగ్రెస్‌లో ‘‘సస్టైనబుల్- వైఫై’’అనే అంశంపై ప్రసంగించాలని కోరారు. అలాగే.. ఇంటింటికీ ఇంటర్నెట్ ప్రాజెక్టు, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్‌స, ఈ-హెల్త్, ఈ-విద్యా వంటి అంశాలపైన మంత్రి ఈ సమావేశంలో ప్రసంగిస్తారు.
హైదరాబాద్‌లో జాతీయ విత్తన పరిశోధనా కేంద్రందక్షిణ భారతదేశ అవసరాల నిమిత్తం హైదరాబాద్‌లో జాతీయ విత్తన పరిశోధనా సంస్థ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) టాస్క్‌ఫోర్స్ రెండో సమావేశంలో నిర్ణయించారు. ఓఈసీడీ ధ్రువీకరణ సిబ్బంది నైపుణ్య సామర్థ్య పెంపుదల కేందాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. అలాగే... దేశీయ విత్తన ధ్రువీకరణను ఒకే పద్ధతిన చేపట్టాలని.. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌లో 8 రోజుల పాటు అంతర్జాతీయ ఇస్టా కాంగ్రెస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,55,000గా పేర్కొంది.
గాజువాక ఫస్ట్.. రంపచోడవరం లాస్ట్ తలసరి ఆదాయంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి తొలి పది స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజవర్గాలు.. అలాగే చివరి పది స్థానాల్లో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
తలసరి ఆదాయంలో తొలి పది నియోజకవర్గాలు
తలసరి ఆదాయంలో చివరి పది నియోజవర్గాలు
జాతీయ స్థాయిలో..
తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో హర్యాణా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్నాయి.
టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ .. బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సెప్టెంబర్ 22న ప్రకటించింది. ఈ ఏడాదిగాను భారతీయ రైల్వే ప్రకటించిన రైల్వే స్టేషన్ ల ర్యాంకింగ్స్‌లోను విశాఖపట్నం స్టేషన్ ఏ1 క్యాటగిరీలో ఉత్తమ స్వచ్ఛ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది.
తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1 విజేత శివ బాలాజీతెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1లో 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. ఈ మేరకు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 24న శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగింది.
ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్వచ్ఛ దర్పన్‌లో తొలి స్థానంలో జగిత్యాల, సిరిసిల్లస్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్రం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ పథకంలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, సిరిసిల్ల జిలాల్లు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం స్వచ్ఛదర్పన్ పథకం కింద దేశంలో 7 రాష్ట్రాలకు స్థానం కల్పించగా.. ఇందులో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా మొదటి ర్యాంకులు పొందాయి. జగిత్యాల జిల్లాకు కేంద్రం పెర్ఫార్‌మెన్‌సపై మొదటి కేటగిరీలో 50 మార్కులు, అవగాహనపై రెండో కేటగిరీలో 15 మార్కులు, పారదర్శకత్వం కింద టాయిలెట్స్‌ను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసే మూడో కేటగిరీలో 25 మార్కులు కేటాయించింది.
వంశధార జలాల వివాదంపై తుది తీర్పు
వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ వంశధార జలాల వివాద పరిష్కార న్యాయస్థానం(వీడబ్ల్యూడీటీ) సెప్టెంబర్ 13న తుది తీర్పు వెలువరించింది. కాట్రగడ్డ సైడ్ వియర్ (మత్తడి- అడ్డుగోడ), నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మొహమ్మద్‌లతో కూడిన ధర్మాసనం 14 క్లాజులతో కూడిన ఆరు పేజీల తీర్పును వెలువరించింది.
వంశధార జలాలు చెరిసగం
తెలంగాణలో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 100 రోజులపాటు ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,343 బృందాలు పనిచేస్తాయి.
ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇచ్చేవి :
1) ఆన్‌లైన్-1బీ ప్రతి
2) రశీదు
3) మార్పుచేర్పుల ప్రతిపాదన పత్రం.
తెలంగాణలో దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. '1962' టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ సంచార పశు వైద్యశా లలను సంప్రదించవచ్చు. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరేలా రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ-ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి నివేదికతెలంగాణ రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది. ఈ మేరకు అసోచామ్ ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘తెలంగాణ-ఆర్థికవృద్ధి,పెట్టుబడుల పురోగతి’ పేరుతో ఒక నివేదికను సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం పెట్టుబడుల సమీకరణలో గత ఐదేళ్లలో తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. అలాగే.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి రూ.3.3 లక్షల కోట్ల దేశ, విదేశీ పెట్టుబడులు వస్తే... 2016-17లో రూ.5.9 లక్షల కోట్లు వచ్చాయి.
నివేదికలోని ప్రధాన అంశాలు
2017-18 తొలి త్రైమాసికంలో ఏపీ వృద్ధి రేటు 11.72 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపని ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15న వెల్లడించారు. ఈ వృద్ధి రేటులో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో హర్యానా తొలి స్థానంలో ఉంది.
విశాఖపట్నంలో ప్రాంతీయ పర్యావరణ సదస్సుజాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు విశాఖలో సంయుక్తంగా ప్రాంతీయ పర్యావరణ సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లోని మైదాన ప్రాంతంలో 2029 సంవత్సరం నాటికి 50 శాతం పచ్చదనం నింపుతామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం పచ్చదనం మాత్రమే ఉందన్నారు.
తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ సదారాం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి నియమి తులయ్యారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపాదించగా.. సెప్టెంబర్ 15న గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు.
డిసెంబర్‌లో తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించను న్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది.
జీహెచ్‌ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డుపర్యాటక ప్రాంతాల్లో మెరుగైన పౌరసేవల నిర్వహణ విభాగం కింద కేంద్ర పర్యాటక శాఖ జీహెచ్‌ఎంసీకి 2015-16 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాన్ని ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాలు.. ముఖ్యంగా అత్యంత మెరుగైన రీతిలో పారిశుధ్య నిర్వహణకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై సమీక్షించి ఈ అవార్డును ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును న్యూఢిల్లీలో అందజేయనున్నారు.
గడ్డమల్లయ్యగూడేనికి సాక్షరభారత్ అవార్డురంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడెం వయోజన విద్యలో సాధించిన ఘనతకుగాను సాక్షర భారత్ జాతీయ అవార్డు -2017కు ఎంపికైంది. ఈ మేరకు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న జరిగిన కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ నర్రె మల్లేశ్, వయోజన విద్య డిప్యూటీ డెరైక్టర్ రాందాసునాయక్ అవార్డు అందుకున్నారు.
గ్రామంలో 103 మంది వయోజనులు నిరక్షరాస్యులుగా ఉన్నారని గ్రహించి వారికి రాత్రిపూట చదువు నేర్పించి గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించినందుకు గాను ఈ అవార్డు దక్కింది.
తెలంగాణలో 23 పులులురాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులు క్షేమంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల టైగర్ రిజర్వులో 14, కవ్వాల్ అభయారణ్యంలో 9 పులులు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు లెక్కించారు. సీసీ కెమెరాల చిత్రాలు, పులుల పాదముద్రలు, పెంటిక (మలం) పరీక్షల ద్వారా వాటి సంఖ్యను, ఆరోగ్యాన్ని నిర్ధారించారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి పులులు వలస వస్తున్నాయని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టు దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ - అమరావతి మధ్య ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB).. అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీస్(HTT) సంస్థతో సెప్టెంబర్ 7న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి (35 కిలోమీటర్లు) కేవలం 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
భూగర్భం లేదా పైలాన్లపై పైపులు వేసి.. వాటిలో వ్యాక్యూమ్ తప్ప గాలి లేకుండా చేసి.. రైలు, బస్సు తరహాలో ఉండే చిన్న వాహనాలను నడపటమే హైపర్‌లూప్ టెక్నాలజీ. దీన్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీల్లో హెచ్‌టీటీ సంస్థదే పై చేయి. అయితే.. ఈ విధానం ఇప్పటికీ పలు దేశాల్లో అధ్యయన స్థాయిలోనే ఉంది. ప్రపంచంలోని ఏ దేశంలోను ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
విశాఖ సాగరతీరంలో స్లినెక్స్-2017భారత్, శ్రీలంక దేశాల 7వ సంయుక్త యుద్ధ నౌకా విన్యాసాలు(స్లెనెక్స్ - 2017) విశాఖ సాగర తీరంలో సెప్టెంబర్ 7న ప్రారంభయ్యాయి. సెప్టెంబర్ 14 వరకు కొనసాగే ఈ నౌకా విన్యాసాలు రెండు విడతల్లో జరుగుతాయి. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జరిగే తొలి దశ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సంస్కృతి, సామాజిక, వృత్తిపరమైన అంశాలపై చర్చిస్తారు. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు జరిగే మలిదశలో యాంటీ పైరసీ విన్యాసాలు, గన్ ఫైరింగ్, క్రాస్‌డెక్ హెలికాఫ్టర్ ఆపరేషన్లు, యాంటీ సర్ఫేస్ విన్యాసాలు నిర్వహిస్తారు.
భారత తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్ ఘరియల్, ఐఎన్‌ఎస్ కోరా, చేతక్ హెలికాఫ్టర్.. శ్రీలంకకు చెందిన సయుర, సాగర యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
ఇరు దేశాల నౌకా దళాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు 2005 నుంచి ఈ బైలేటరల్ మేరీటైమ్ విన్యాసాలు జరుగుతున్నాయి.
కవి సీతారాంకు కాళోజీ పురస్కారంతెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రకటించే కాళోజీ నారాయణ అవార్డు ఈ ఏడాది ప్రముఖ కవి సీతారాంకు దక్కింది. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల్లో సీతారాంకు ఈ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1,01,116 నగదు అందజేశారు.
2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, 2015 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ కాళోజీ పురస్కారాన్ని అందుకున్నారు.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోఏయూ నంబర్ 1టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన ర్యాంకుల్లో గత ఏడాది లాగానే ఏయూ 800-1000 ర్యాంకుల మధ్యే నిలిచింది. అయితే గతంతో పోల్చితే కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానం, దేశంలోనే 19వ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, బోధన, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, ప్రాంగణ ఎంపికలు, మౌలిక వసతులు, పరిశ్రమల నుంచి ఆదాయం, అంతర్జాతీయ దృక్పథం వంటి రంగాలను ప్రాతిపదికగా తీసుకుని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకును అందించింది.
తెలంగాణలో టీ-రేషన్ యాప్ ఆవిష్కరణరాష్ట్రంలోని పౌరసరఫరాల దుకాణాల్లో రేషన్ నిల్వలు, రేషన్ కార్డుల పోర్టబిలిటీ తదితర సేవల కోసం సివిల్ సప్లయిస్ శాఖ టీ - రేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 8న పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా కార్డుదారులు తమకు దగ్గరలోని రేషన్ దుకాణాల లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించింది.
అక్టోబర్ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమాఅక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. అక్టోబర్ 2 నుంచి 2018 మే 31 వరకు రెండో విడత పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
వాణిజ్యపోర్టుగా తూర్పుగోదావరి జిల్లాలోని క్యాప్టివ్ పోర్టుతూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టివ్ పోర్టును స్విస్ చాలెంజ్ విధానంలో వాణిజ్య పోర్టుగా మార్పు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతించింది. ఈ మేరకు సెప్టంబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఐపీసీలోని 376, 354 సెక్షన్లకు సంబంధించి న్యాయవిచారణలో ఉన్న మహిళా కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సిబ్బందిని ఈ కోర్టుల్లో సర్దుబాటు చేస్తారు.
విశాఖలో అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఆవిష్కరణలను ప్రదర్శించేలా విశాఖలో అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్-2017 సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ఇన్వెంటర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సమాఖ్య అధ్యక్షుడు అలిరేజా రాస్టేగర్ ప్రారంభించారు. ఈ ఫెయిర్‌లో 30 దేశాలకు సంబంధించిన నూతన ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘యువశాస్త్రవేత్తలు- ప్రాజెక్టుల వివరాలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ప్రతిష్టాత్మక అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగాను రాష్ట్రానికి ఈ అవార్ఢు లభించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగటున ప్రతినెలా ఒక అవార్డును పర్యాటక శాఖ దక్కించుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ భువనేశ్వర్ వేదికగా నిర్వహించిన 33వ వార్షిక సదస్సులో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ ఉత్తమమైనదిగా ఎంపికైంది.
సత్ఫలితాలిస్తున్న మూషిక జింకల సంరక్షణ చర్యలుమూషిక జింకల రక్షణ, సంతతి పెంపు కోసం తెలంగాణ అటవీ శాఖ దేశంలోనే తొలిసారిగా చేసిన అరుదైన ప్రయత్నం విజయవంతమైంది. నల్లమల అడవుల్లో గతంలో విరివిగా కనిపించే మూషిక జింకలు (మౌజ్ డీర్) అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో.. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన కొన్ని మూషిక జింకలను నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యేకంగా సంరక్షించటంతో పాటు, ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2010లో మొదలైన ఈ ప్రయత్నం అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతో పూర్తి విజయవంత మయింది. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల సంఖ్య క్రమంగా పెరిగి 172కు చేరింది. వీటిలో 96 మగవి, 76 ఆడవి ఉన్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండున్నర హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో అన్ని ఏర్పాట్లు చేసి విడిచి పెట్టారు. కొద్ది రోజుల పాటు పరిశీలించి అడవిలోకి వదిలిపెట్టనున్నారు.
‘జర్ని పంది’గా కూడా పిలిచే ఈ రకమైన జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడవుల్లోనే జీవిస్తాయి. అయితే అడవులు తగ్గిపోవటం, వేటగాళ్ల వల్ల ఇవి క్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రత్యేకమైన జాతిని సంరక్షించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో జీఎస్‌టీ మండలి 21వ సమావేశం
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 21వ సమావేశం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో 30 నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లక్ష్మణ్‌రెడ్డికి పీఎస్‌టీయూ కీర్తి పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఏటా అందజేసే కీర్తి పురస్కారానికి జన చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఆగస్టు 31న జరిగిన కార్యక్రమంలో ఆయన కీర్తి పురస్కారం-2016ని అందుకున్నారు. హేతువాదం గురించి విసృ్తతంగా ప్రచారం చేసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సీఎం అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం నిర్ణయించింది. నాలుగు, ఐదు, తొమ్మిది జోన్లలో మొత్తం రూ. 6,900 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా కల్పించాలని భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలని సీఎం ఆదేశించారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్: మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మొదట కొంత శాతం నిధులను కేటాయించి.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయడం
తెలంగాణలో 2 ఏళ్లలో 1,990 రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో 2015లో 1,358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నివారణ చర్యలు, మైనారిటీల అభివృద్ధ్ది, యువత ఉపాధికి చర్యలు, విద్యుత్ రంగంలో మార్పులు తదితరాల పరిశీలనకు చైర్మన్ సతీశ్ చంద్ర మిశ్రా, హుసేన్ దల్వాయి, మహ్మద్ నదీమ్ ఉల్ హక్, లాల్‌సింగ్ వడోదిన్, మధుసూదన్ మిస్త్రీ, విప్లవ్ ఠాకూర్‌లతో కూడిన రాజ్యసభ హామీల అమలు కమిటీ ఆగస్టు 31న రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో భేటీ అయిన సీఎస్ ఎస్పీ సింగ్.. రైతు ఆత్మహత్యల వివరాలు, ఆ రైతు కుటుంబాలకు పరిహారమివ్వడంతో పాటు పలు విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య రూ. 3 వేల కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఆగస్టు 31న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇరు ప్రభుత్వాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా, ఆక్వా కల్చర్ వంటి రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియా పెట్టుబడులు పెడుతుంది. రెండు ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలపై గతంలోనే ఒప్పందం కుదిరింది.
ఒప్పందాలివి..
తెలంగాణలో 45 లక్షల మంది రైతులు రాష్ట్రంలోని 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాల భూమి ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ భూములకు సంబంధించి చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదిక వివరాలను ఆగస్టు 31న వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
జ్యోతి సురేఖకు కోటి నజరానాఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. కోటి నజరానాను ప్రకటించారు. ఇటీవల ‘అర్జున’ అవార్డును అందుకున్న సురేఖ, ఆగస్టు 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ఆయన నగదు ప్రోత్సాహకంతో పాటు విజయవాడలో 500 గజాల ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయంతూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 48 డివిజన్లకు (మొత్తం 50) ఆగస్టు 29న జరిగిన ఎన్నికల లెక్కింపు సెప్టెంబర్ 1న ముగిసింది. దీనిలో టీడీపీ 32 స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10, బీజేపీ మూడు సీట్లు గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా దక్కలేదు. కోర్టు వివాదం వల్ల రెండు డివిజన్లకు ఎన్నికలు జరగలేదు.
ఏపీ ప్రాజెక్టులకు నాబార్డు రూ.1,516.78 కోట్ల రుణంఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ఈ ఏడాదికి రూ.1,516.78 కోట్లను నాబార్డు ద్వారా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానమంత్రి కృషి సంఛాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద ఆరు ప్రాజెక్టులు- గుండ్లకమ్మ, పుష్కర, ముసురుమిల్లి, తాడిపూడి, తారకరామతీర్థ సాగరం, ఎర్ర కాలువలకు రూ.537.42 కోట్లు (కేంద్రప్రభుత్వ వాటా రూ.389.57 కోట్లు, రాష్ట్ర వాటా రూ.147.85 కోట్లు)ను నాబార్డు ద్వారా విడుదల చేయడానికి అంగీకరించింది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇచ్చే రూ.147.85 కోట్లను ఆరుశాతం వడ్డీపై నాబార్డు రుణం రూపంలో సమకూర్చుతుంది.
నాబార్డు వద్ద దీర్ఘకాలిక నీటిపారుదల నిధి(ఎల్‌టీఐఎఫ్) పేరిట ఏర్పాటు చేసిన నిధుల కింద పోలవరం ప్రాజెక్టుకు రూ.979.36 కోట్లను విడుదల చేసేందుకూ కేంద్రం అంగీకారం తెలిపింది.
కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సెప్టెంబర్ 3న తెలిపింది.
స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్ గవర్నెన్‌స మ్యాప్‌ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది.
తెలంగాణలో గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్గ్రీన్‌హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్ (పూల మొక్కల పెంపకం) సాగుకు కూడా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) సెప్టెంబర్ 4న స్పష్టం చేసింది. ఈ మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పరిధిలోకి ఈ కేటగిరీలను చేర్చింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.
మిస్ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ‘మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్- 2017’ అందాల పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ విజేతగా నిలిచింది. భారతీయ సంతతి యువతి ఈ పోటీలో నెగ్గడం ఇది రెండోసారి. 25ఏళ్ల శ్రీశుభ ప్రస్తుతం జోహన్నస్‌బర్గ్‌లో ఓ ప్రముఖ బ్యాంకులో 18నెలల నుంచి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. అందాల పోటీలో తుదిపోరు సందర్భంగా ఓ పాటకు ఈమె చేసిన నృత్యం జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది.
సుజల స్రవంతి తొలిదశకు పరిపాలన అనుమతిఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. తొలి దశ అంచనా వ్యయాన్ని రూ. 2,022.20 కోట్లకు పెంచుతూ సెప్టెంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీల గోదావరి జలాలను తరలించి విశాఖ జిల్లాలో నిర్మించే పెదపూడి రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎక రాలకు సాగునీళ్లందించాలని నిర్ణయించింది.
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదు: కేంద్ర హోంశాఖవేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 4న తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది.
‘నల్సార్’లో ఐఐఎల్ సమావేశం ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ లా (ఐఐఎల్) 78వ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో సెప్టెంబర్ 3న ప్రారంభించారు. ఇందులో దాదాపు 60 దేశాల న్యాయకోవిదులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు మన దేశంలో జరగడం ఇదే తొలిసారి.

నియోజకవర్గం
|
జిల్లా
|
తలసరి ఆదాయం(రూ.)
|
ర్యాంకు
|
గాజువాక
|
విశాఖపట్నం
|
2,13,963
|
1
|
యలమంచిలి
|
విశాఖపట్నం
|
1,97,283
|
2
|
కైకలూరు
|
కృష్ణా
|
1,90,225
|
3
|
విశాఖ సౌత్
|
విశాఖపట్నం
|
1,84,466
|
4
|
విశాఖ వెస్ట్
|
విశాఖపట్నం
|
1,74,183
|
5
|
కాకినాడ సిటీ
|
తూర్పుగోదావరి
|
1,72,172
|
6
|
అవనిగడ్డ
|
కృష్ణా
|
1,71,884
|
7
|
గుంటూరు వెస్ట్
|
గుంటూరు
|
1,70,175
|
8
|
సంతనూతలపాడు
|
ప్రకాశం
|
1,69,029
|
9
|
కావలి
|
నెల్లూరు
|
1,68,246
|
10
|
తలసరి ఆదాయంలో చివరి పది నియోజవర్గాలు
| నియోజకవర్గం | జిల్లా | తలసరి ఆదాయం(రూ.) | ర్యాంకు |
| రంపచోడవరం | తూర్పుగోదావరి | 51,652 | 175 |
| మడకశిర | అనంతపురం | 53,092 | 174 |
| పిఠాపురం | తూర్పుగోదావరి | 56, 997 | 173 |
| అరకు | విశాఖపట్నం | 60,716 | 172 |
| ఇచ్ఛాపురం | శ్రీకాకుళం | 64,003 | 171 |
| నర్సారావుపేట | గుంటూరు | 66,640 | 170 |
| కురుపాం | విజయనగరం | 66,695 | 169 |
| పాడేరు | విశాఖపట్నం | 67,586 | 168 |
| ఉరవకొండ | అనంతపురం | 68,249 | 167 |
| పాలకొండ | శ్రీకాకుళం | 68,499 | 166 |
జాతీయ స్థాయిలో..
తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో హర్యాణా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్నాయి.
| రాష్ట్రం | 2014-15 | 2015-16 | 2016-17 |
| హర్యాణా | 1,48,485 | 1,62,034 | 1,80,174 |
| మహారాష్ట్ర | 1,32,341 | 1,47,399 | ----- |
| కేరళ | 1,35,337 | 1,47,190 | ----- |
| కర్ణాటక | 1,29,823 | 1,42,906 | 1,57,474 |
| గుజరాత్ | 1,27,017 | 1,41,504 | ------ |
| తెలంగాణ | 1,24,058 | 1,37,955 | 1,55,612 |
| తమిళనాడు | 1,28,385 | 1,37,837 | 1,53,263 |
| పంజాబ్ | 1,08,897 | 1,19,261 | 1,28,821 |
| ఆంధ్రప్రదేశ్ | 93,699 | 1,08,163 | 1,22,376 |
టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ .. బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సెప్టెంబర్ 22న ప్రకటించింది. ఈ ఏడాదిగాను భారతీయ రైల్వే ప్రకటించిన రైల్వే స్టేషన్ ల ర్యాంకింగ్స్‌లోను విశాఖపట్నం స్టేషన్ ఏ1 క్యాటగిరీలో ఉత్తమ స్వచ్ఛ రైల్వే స్టేషన్‌గా ఎంపికైంది.
తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1 విజేత శివ బాలాజీతెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ - 1లో 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. ఈ మేరకు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 24న శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగింది.
ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్వచ్ఛ దర్పన్‌లో తొలి స్థానంలో జగిత్యాల, సిరిసిల్లస్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్రం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ పథకంలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, సిరిసిల్ల జిలాల్లు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం స్వచ్ఛదర్పన్ పథకం కింద దేశంలో 7 రాష్ట్రాలకు స్థానం కల్పించగా.. ఇందులో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా మొదటి ర్యాంకులు పొందాయి. జగిత్యాల జిల్లాకు కేంద్రం పెర్ఫార్‌మెన్‌సపై మొదటి కేటగిరీలో 50 మార్కులు, అవగాహనపై రెండో కేటగిరీలో 15 మార్కులు, పారదర్శకత్వం కింద టాయిలెట్స్‌ను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసే మూడో కేటగిరీలో 25 మార్కులు కేటాయించింది.
వంశధార జలాల వివాదంపై తుది తీర్పు
వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ వంశధార జలాల వివాద పరిష్కార న్యాయస్థానం(వీడబ్ల్యూడీటీ) సెప్టెంబర్ 13న తుది తీర్పు వెలువరించింది. కాట్రగడ్డ సైడ్ వియర్ (మత్తడి- అడ్డుగోడ), నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మొహమ్మద్‌లతో కూడిన ధర్మాసనం 14 క్లాజులతో కూడిన ఆరు పేజీల తీర్పును వెలువరించింది.
వంశధార జలాలు చెరిసగం
- గొట్టా బ్యారేజ్ వద్ద వంశధారలో అందుబాటులో ఉండే నదీ జలాలు 115 టీఎంసీలుగా ట్రిబ్యునల్ నిర్ధారించింది. రెండు రాష్ట్రాల మధ్య సెప్టెంబరు 30, 1962న కుదిరిన ఒప్పందం మేరకు వంశధార జలాల్లో చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయించింది.
- నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు అప్పగించాలని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
- నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది.
- కాట్రగడ్డ సైడ్ వియర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి 8 టీఎంసీలు మళ్లించే దాకా గానీ లేదా నవంబర్ 30వరకూ గానీ తెరిచి ఉంచాలని.. డిసెంబర్ 1న మూసివేయాలంటూ షరతు విధించింది. నేరడి బ్యారేజి పూర్తయిన తరువాత కాట్రగడ్డ సైడ్ వియర్‌ను తొలగించాలని స్పష్టంచేసింది.
- ఈ తీర్పు అమలుకు వంశధార నదీ యాజమాన్య బోర్డు (వీఎంఆర్‌బీ)ని ఏర్పాటు చేయాలని సూచించింది.
తెలంగాణలో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 100 రోజులపాటు ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,343 బృందాలు పనిచేస్తాయి.
ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇచ్చేవి :
1) ఆన్‌లైన్-1బీ ప్రతి
2) రశీదు
3) మార్పుచేర్పుల ప్రతిపాదన పత్రం.
తెలంగాణలో దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించింది. '1962' టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ సంచార పశు వైద్యశా లలను సంప్రదించవచ్చు. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరేలా రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ-ఆర్థికవృద్ధి, పెట్టుబడుల పురోగతి నివేదికతెలంగాణ రాష్ట్రం గత ఐదేళ్లలో ఏకంగా మూడింతలకు పైగా పెట్టుబడుల వృద్ధి సాధించిందని ‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)’ ప్రకటించింది. ఈ మేరకు అసోచామ్ ఎకనమిక్ రీసెర్చ్ బ్యూరో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘తెలంగాణ-ఆర్థికవృద్ధి,పెట్టుబడుల పురోగతి’ పేరుతో ఒక నివేదికను సెప్టెంబర్ 14న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం పెట్టుబడుల సమీకరణలో గత ఐదేళ్లలో తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. అలాగే.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి రూ.3.3 లక్షల కోట్ల దేశ, విదేశీ పెట్టుబడులు వస్తే... 2016-17లో రూ.5.9 లక్షల కోట్లు వచ్చాయి.
నివేదికలోని ప్రధాన అంశాలు
- ఐదేళ్ల వ్యవధిలో పెట్టుబడుల సాధనలో జాతీయ వృద్ధి రేటు 27 శాతంగా నమోదుకాగా... తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకున్నా.. 68.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే వ్యవధిలో జాతీయ సగటు వృద్ధి 20.8 శాతం మాత్రమే.
- గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.177 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అందులో 3.3 శాతం వాటాను నిలుపుకుంది.
- పెట్టుబడుల సమీకరణలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. 2012తో పోలిస్తే 2017 నాటికి తెలంగాణ 79 శాతం వృద్ధి సాధిస్తే.. ఆంధ్రప్రదేశ్ 50.8 శాతం, కేరళ 18.9 శాతం, తమిళనాడు 11.2 శాతం, కర్ణాటక 0.2 శాతం వృద్ధి సాధించాయి.
- 2017లో తెలంగాణ ప్రాంత ఆర్థికవృద్ధి రేటు 8.5 శాతానికి చేరింది. ఇదే వ్యవధిలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
- తెలంగాణలో 55 శాతం మంది జనాభా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు.
2017-18 తొలి త్రైమాసికంలో ఏపీ వృద్ధి రేటు 11.72 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రం 11.72 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే రెట్టింపని ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15న వెల్లడించారు. ఈ వృద్ధి రేటులో 40 శాతం వాటా ఫిషరీస్ రంగానిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో హర్యానా తొలి స్థానంలో ఉంది.
విశాఖపట్నంలో ప్రాంతీయ పర్యావరణ సదస్సుజాతీయ హరిత ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు విశాఖలో సంయుక్తంగా ప్రాంతీయ పర్యావరణ సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లోని మైదాన ప్రాంతంలో 2029 సంవత్సరం నాటికి 50 శాతం పచ్చదనం నింపుతామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం పచ్చదనం మాత్రమే ఉందన్నారు.
తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ సదారాం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి నియమి తులయ్యారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపాదించగా.. సెప్టెంబర్ 15న గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు.
డిసెంబర్‌లో తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించను న్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది.
జీహెచ్‌ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డుపర్యాటక ప్రాంతాల్లో మెరుగైన పౌరసేవల నిర్వహణ విభాగం కింద కేంద్ర పర్యాటక శాఖ జీహెచ్‌ఎంసీకి 2015-16 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాన్ని ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాలు.. ముఖ్యంగా అత్యంత మెరుగైన రీతిలో పారిశుధ్య నిర్వహణకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై సమీక్షించి ఈ అవార్డును ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును న్యూఢిల్లీలో అందజేయనున్నారు.
గడ్డమల్లయ్యగూడేనికి సాక్షరభారత్ అవార్డురంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడెం వయోజన విద్యలో సాధించిన ఘనతకుగాను సాక్షర భారత్ జాతీయ అవార్డు -2017కు ఎంపికైంది. ఈ మేరకు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న జరిగిన కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ నర్రె మల్లేశ్, వయోజన విద్య డిప్యూటీ డెరైక్టర్ రాందాసునాయక్ అవార్డు అందుకున్నారు.
గ్రామంలో 103 మంది వయోజనులు నిరక్షరాస్యులుగా ఉన్నారని గ్రహించి వారికి రాత్రిపూట చదువు నేర్పించి గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించినందుకు గాను ఈ అవార్డు దక్కింది.
తెలంగాణలో 23 పులులురాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులు క్షేమంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల టైగర్ రిజర్వులో 14, కవ్వాల్ అభయారణ్యంలో 9 పులులు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు లెక్కించారు. సీసీ కెమెరాల చిత్రాలు, పులుల పాదముద్రలు, పెంటిక (మలం) పరీక్షల ద్వారా వాటి సంఖ్యను, ఆరోగ్యాన్ని నిర్ధారించారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి పులులు వలస వస్తున్నాయని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టు దేశంలోనే తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ - అమరావతి మధ్య ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB).. అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీస్(HTT) సంస్థతో సెప్టెంబర్ 7న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి (35 కిలోమీటర్లు) కేవలం 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
భూగర్భం లేదా పైలాన్లపై పైపులు వేసి.. వాటిలో వ్యాక్యూమ్ తప్ప గాలి లేకుండా చేసి.. రైలు, బస్సు తరహాలో ఉండే చిన్న వాహనాలను నడపటమే హైపర్‌లూప్ టెక్నాలజీ. దీన్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీల్లో హెచ్‌టీటీ సంస్థదే పై చేయి. అయితే.. ఈ విధానం ఇప్పటికీ పలు దేశాల్లో అధ్యయన స్థాయిలోనే ఉంది. ప్రపంచంలోని ఏ దేశంలోను ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
విశాఖ సాగరతీరంలో స్లినెక్స్-2017భారత్, శ్రీలంక దేశాల 7వ సంయుక్త యుద్ధ నౌకా విన్యాసాలు(స్లెనెక్స్ - 2017) విశాఖ సాగర తీరంలో సెప్టెంబర్ 7న ప్రారంభయ్యాయి. సెప్టెంబర్ 14 వరకు కొనసాగే ఈ నౌకా విన్యాసాలు రెండు విడతల్లో జరుగుతాయి. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జరిగే తొలి దశ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సంస్కృతి, సామాజిక, వృత్తిపరమైన అంశాలపై చర్చిస్తారు. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు జరిగే మలిదశలో యాంటీ పైరసీ విన్యాసాలు, గన్ ఫైరింగ్, క్రాస్‌డెక్ హెలికాఫ్టర్ ఆపరేషన్లు, యాంటీ సర్ఫేస్ విన్యాసాలు నిర్వహిస్తారు.
భారత తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్ ఘరియల్, ఐఎన్‌ఎస్ కోరా, చేతక్ హెలికాఫ్టర్.. శ్రీలంకకు చెందిన సయుర, సాగర యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
ఇరు దేశాల నౌకా దళాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు 2005 నుంచి ఈ బైలేటరల్ మేరీటైమ్ విన్యాసాలు జరుగుతున్నాయి.
కవి సీతారాంకు కాళోజీ పురస్కారంతెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రకటించే కాళోజీ నారాయణ అవార్డు ఈ ఏడాది ప్రముఖ కవి సీతారాంకు దక్కింది. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల్లో సీతారాంకు ఈ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1,01,116 నగదు అందజేశారు.
2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న, 2015 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ కాళోజీ పురస్కారాన్ని అందుకున్నారు.
టైమ్స్ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోఏయూ నంబర్ 1టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన ర్యాంకుల్లో గత ఏడాది లాగానే ఏయూ 800-1000 ర్యాంకుల మధ్యే నిలిచింది. అయితే గతంతో పోల్చితే కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానం, దేశంలోనే 19వ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, బోధన, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, ప్రాంగణ ఎంపికలు, మౌలిక వసతులు, పరిశ్రమల నుంచి ఆదాయం, అంతర్జాతీయ దృక్పథం వంటి రంగాలను ప్రాతిపదికగా తీసుకుని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకును అందించింది.
తెలంగాణలో టీ-రేషన్ యాప్ ఆవిష్కరణరాష్ట్రంలోని పౌరసరఫరాల దుకాణాల్లో రేషన్ నిల్వలు, రేషన్ కార్డుల పోర్టబిలిటీ తదితర సేవల కోసం సివిల్ సప్లయిస్ శాఖ టీ - రేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 8న పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా కార్డుదారులు తమకు దగ్గరలోని రేషన్ దుకాణాల లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించింది.
అక్టోబర్ 2 నుంచి ప్రధానమంత్రి చంద్రన్న బీమాఅక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత చంద్రన్న బీమా పథకానికి ‘ప్రధానమంత్రి చంద్రన్న బీమా’గా పేరు మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. అక్టోబర్ 2 నుంచి 2018 మే 31 వరకు రెండో విడత పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకంలో భాగంగా 2.20 కోట్ల అసంఘటిత కార్మికుల తరఫున 8 నెలల ప్రీమియంకు గాను రూ.235 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. 70 ఏళ్లు దాటిన పాలసీదారులను చంద్రన్న బీమా పథకం నుంచి తొలగించి, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
వాణిజ్యపోర్టుగా తూర్పుగోదావరి జిల్లాలోని క్యాప్టివ్ పోర్టుతూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టివ్ పోర్టును స్విస్ చాలెంజ్ విధానంలో వాణిజ్య పోర్టుగా మార్పు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతించింది. ఈ మేరకు సెప్టంబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఐపీసీలోని 376, 354 సెక్షన్లకు సంబంధించి న్యాయవిచారణలో ఉన్న మహిళా కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సిబ్బందిని ఈ కోర్టుల్లో సర్దుబాటు చేస్తారు.
విశాఖలో అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఆవిష్కరణలను ప్రదర్శించేలా విశాఖలో అంతర్జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్-2017 సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ఇన్వెంటర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సమాఖ్య అధ్యక్షుడు అలిరేజా రాస్టేగర్ ప్రారంభించారు. ఈ ఫెయిర్‌లో 30 దేశాలకు సంబంధించిన నూతన ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘యువశాస్త్రవేత్తలు- ప్రాజెక్టుల వివరాలు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ఏపీ ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రంగా ప్రతిష్టాత్మక అడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకుగాను రాష్ట్రానికి ఈ అవార్ఢు లభించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగటున ప్రతినెలా ఒక అవార్డును పర్యాటక శాఖ దక్కించుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ భువనేశ్వర్ వేదికగా నిర్వహించిన 33వ వార్షిక సదస్సులో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ ఉత్తమమైనదిగా ఎంపికైంది.
సత్ఫలితాలిస్తున్న మూషిక జింకల సంరక్షణ చర్యలుమూషిక జింకల రక్షణ, సంతతి పెంపు కోసం తెలంగాణ అటవీ శాఖ దేశంలోనే తొలిసారిగా చేసిన అరుదైన ప్రయత్నం విజయవంతమైంది. నల్లమల అడవుల్లో గతంలో విరివిగా కనిపించే మూషిక జింకలు (మౌజ్ డీర్) అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో.. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన కొన్ని మూషిక జింకలను నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యేకంగా సంరక్షించటంతో పాటు, ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2010లో మొదలైన ఈ ప్రయత్నం అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతో పూర్తి విజయవంత మయింది. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల సంఖ్య క్రమంగా పెరిగి 172కు చేరింది. వీటిలో 96 మగవి, 76 ఆడవి ఉన్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండున్నర హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో అన్ని ఏర్పాట్లు చేసి విడిచి పెట్టారు. కొద్ది రోజుల పాటు పరిశీలించి అడవిలోకి వదిలిపెట్టనున్నారు.
‘జర్ని పంది’గా కూడా పిలిచే ఈ రకమైన జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడవుల్లోనే జీవిస్తాయి. అయితే అడవులు తగ్గిపోవటం, వేటగాళ్ల వల్ల ఇవి క్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రత్యేకమైన జాతిని సంరక్షించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో జీఎస్‌టీ మండలి 21వ సమావేశం
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 21వ సమావేశం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీలో 30 నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లక్ష్మణ్‌రెడ్డికి పీఎస్‌టీయూ కీర్తి పురస్కారం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఏటా అందజేసే కీర్తి పురస్కారానికి జన చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఆగస్టు 31న జరిగిన కార్యక్రమంలో ఆయన కీర్తి పురస్కారం-2016ని అందుకున్నారు. హేతువాదం గురించి విసృ్తతంగా ప్రచారం చేసినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని ప్రతిపాదిత 13 జోన్లలో మూడు జోన్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సీఎం అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశం నిర్ణయించింది. నాలుగు, ఐదు, తొమ్మిది జోన్లలో మొత్తం రూ. 6,900 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా కల్పించాలని భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలని సీఎం ఆదేశించారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్: మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మొదట కొంత శాతం నిధులను కేటాయించి.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయడం
తెలంగాణలో 2 ఏళ్లలో 1,990 రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో 2015లో 1,358 మంది, 2016లో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నివారణ చర్యలు, మైనారిటీల అభివృద్ధ్ది, యువత ఉపాధికి చర్యలు, విద్యుత్ రంగంలో మార్పులు తదితరాల పరిశీలనకు చైర్మన్ సతీశ్ చంద్ర మిశ్రా, హుసేన్ దల్వాయి, మహ్మద్ నదీమ్ ఉల్ హక్, లాల్‌సింగ్ వడోదిన్, మధుసూదన్ మిస్త్రీ, విప్లవ్ ఠాకూర్‌లతో కూడిన రాజ్యసభ హామీల అమలు కమిటీ ఆగస్టు 31న రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో భేటీ అయిన సీఎస్ ఎస్పీ సింగ్.. రైతు ఆత్మహత్యల వివరాలు, ఆ రైతు కుటుంబాలకు పరిహారమివ్వడంతో పాటు పలు విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య 6 ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య రూ. 3 వేల కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఆగస్టు 31న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇరు ప్రభుత్వాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా, ఆక్వా కల్చర్ వంటి రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియా పెట్టుబడులు పెడుతుంది. రెండు ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలపై గతంలోనే ఒప్పందం కుదిరింది.
ఒప్పందాలివి..
- ఏపీలో ప్రపంచ స్థాయి మైనింగ్ ఇన్సిస్టిట్యూట్ ఏర్పాటుకు కర్టిన్ యూనివర్సిటీ సంసిద్ధత.
- ఖనిజ వనరులను జియోలాజికల్ మ్యాపింగ్ చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా సంస్థ అంగీకారం.
- తిరుపతిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న రోడ్డు మార్గంలో కేఎస్‌ఐ గ్లోబల్ సంస్థ రోలర్ సేఫ్టీ బ్యారియర్ ఏర్పాటు.
- ఆచార్య ఎన్జీ రంగా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీల మధ్య మెట్ట వ్యవసాయంలో పరిశోధనకు ఒప్పందం.
తెలంగాణలో 45 లక్షల మంది రైతులు రాష్ట్రంలోని 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాల భూమి ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ భూములకు సంబంధించి చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదిక వివరాలను ఆగస్టు 31న వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- రాష్ట్రంలో గ్రామాలు 10,733. వాటిలో వెయి్య ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న గ్రామాల సంఖ్య 5,976.
- వెయ్యి ఎకరాల లోపు ఉన్న గ్రామాల్లో 13.91 లక్షల మంది రైతులు. వారి వద్ద 30.43 లక్షల ఎకరాల భూమి.
- 1,001 నుంచి 2 వేల ఎకరాల లోపున్న గ్రామాల్లోనే అత్యధికంగా 43.65 లక్షల ఎకరాల భూమి ఉంది.
జ్యోతి సురేఖకు కోటి నజరానాఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రశ్రేణి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. కోటి నజరానాను ప్రకటించారు. ఇటీవల ‘అర్జున’ అవార్డును అందుకున్న సురేఖ, ఆగస్టు 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా ఆయన నగదు ప్రోత్సాహకంతో పాటు విజయవాడలో 500 గజాల ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయంతూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 48 డివిజన్లకు (మొత్తం 50) ఆగస్టు 29న జరిగిన ఎన్నికల లెక్కింపు సెప్టెంబర్ 1న ముగిసింది. దీనిలో టీడీపీ 32 స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10, బీజేపీ మూడు సీట్లు గెలుపొందాయి. స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లు సాధించగా, కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా దక్కలేదు. కోర్టు వివాదం వల్ల రెండు డివిజన్లకు ఎన్నికలు జరగలేదు.
ఏపీ ప్రాజెక్టులకు నాబార్డు రూ.1,516.78 కోట్ల రుణంఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ఈ ఏడాదికి రూ.1,516.78 కోట్లను నాబార్డు ద్వారా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానమంత్రి కృషి సంఛాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద ఆరు ప్రాజెక్టులు- గుండ్లకమ్మ, పుష్కర, ముసురుమిల్లి, తాడిపూడి, తారకరామతీర్థ సాగరం, ఎర్ర కాలువలకు రూ.537.42 కోట్లు (కేంద్రప్రభుత్వ వాటా రూ.389.57 కోట్లు, రాష్ట్ర వాటా రూ.147.85 కోట్లు)ను నాబార్డు ద్వారా విడుదల చేయడానికి అంగీకరించింది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇచ్చే రూ.147.85 కోట్లను ఆరుశాతం వడ్డీపై నాబార్డు రుణం రూపంలో సమకూర్చుతుంది.
నాబార్డు వద్ద దీర్ఘకాలిక నీటిపారుదల నిధి(ఎల్‌టీఐఎఫ్) పేరిట ఏర్పాటు చేసిన నిధుల కింద పోలవరం ప్రాజెక్టుకు రూ.979.36 కోట్లను విడుదల చేసేందుకూ కేంద్రం అంగీకారం తెలిపింది.
కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సెప్టెంబర్ 3న తెలిపింది.
స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్ గవర్నెన్‌స మ్యాప్‌ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది.
తెలంగాణలో గ్రీన్‌హౌస్‌కు ఉచిత విద్యుత్గ్రీన్‌హౌస్, పాలీహౌస్, ఫ్లోరీ కల్చర్ (పూల మొక్కల పెంపకం) సాగుకు కూడా ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) సెప్టెంబర్ 4న స్పష్టం చేసింది. ఈ మేరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పరిధిలోకి ఈ కేటగిరీలను చేర్చింది. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.
మిస్ ఇండియా దక్షిణాఫ్రికా శ్రీశుభ‘మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్- 2017’ అందాల పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ విజేతగా నిలిచింది. భారతీయ సంతతి యువతి ఈ పోటీలో నెగ్గడం ఇది రెండోసారి. 25ఏళ్ల శ్రీశుభ ప్రస్తుతం జోహన్నస్‌బర్గ్‌లో ఓ ప్రముఖ బ్యాంకులో 18నెలల నుంచి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. అందాల పోటీలో తుదిపోరు సందర్భంగా ఓ పాటకు ఈమె చేసిన నృత్యం జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది.
సుజల స్రవంతి తొలిదశకు పరిపాలన అనుమతిఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. తొలి దశ అంచనా వ్యయాన్ని రూ. 2,022.20 కోట్లకు పెంచుతూ సెప్టెంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీల గోదావరి జలాలను తరలించి విశాఖ జిల్లాలో నిర్మించే పెదపూడి రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎక రాలకు సాగునీళ్లందించాలని నిర్ణయించింది.
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదు: కేంద్ర హోంశాఖవేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 4న తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది.
‘నల్సార్’లో ఐఐఎల్ సమావేశం ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ లా (ఐఐఎల్) 78వ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో సెప్టెంబర్ 3న ప్రారంభించారు. ఇందులో దాదాపు 60 దేశాల న్యాయకోవిదులు పాల్గొన్నారు. ఈ సమావేశాలు మన దేశంలో జరగడం ఇదే తొలిసారి.
No comments:
Post a Comment