డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హడ్కో అవార్డు లభించింది. దీంతోపాటు మరో ఐదు అవార్డులను కూడా తెలంగాణ సొంతం చేసుకుంది. హౌసింగ్ డిజైనింగ్ విభాగంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రెండు, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ బిల్డింగ్‌స విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ భగీరథలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులను దక్కించుకున్నాయి. ఏప్రిల్ 25న హడ్కో 48వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పుర్కరించుకొని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు.
వివిధ విభాగాల్లో వినూత్న విధానాలు ప్రవేశపెట్టి మంచి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అవార్డులను ప్రదానం చేస్తుంది.
టీయాప్ ఫోలియో ఆవిష్కరణ ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు వీలుగా ‘టీయాప్ ఫోలియో’ అనే మొబైల్ అప్లికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25న ప్రారంభించింది. దీని ద్వారా మీసేవా కేంద్రాలకు వెళ్లకుండా దాదాపు 150 ప్రభుత్వ సర్వీసులును పొందవచ్చు. ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు రూపొందించిన ఈ యాప్‌తో మొబైల్, ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకొని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, రిజర్వేషన్ బుకింగ్ వంటి సేవలు పొందవచ్చు.
ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆనం విలక్షణ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
పార్లమెంట్, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.
అంగన్‌వాడీ కేంద్రం హెల్ప్‌లైన్ ప్రారంభం
అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 155209 నంబర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.
తమిళనాడులో ‘అమ్మ అని’ పార్టీ ఆవిష్కరణ
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సోదరుడు దివాకరన్ ‘అమ్మ అని’ (అమ్మ శిబిరం) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు శశికళ మార్గదర్శకంలోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు దివాకరన్ ఏప్రిల్ 29న ప్రకటించారు. శశికళ ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఇటీవల ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పార్టీని ఏర్పాటు చేశాడు.
ఏపీలో అన్ని బస్సులకు లైవ్ ట్రాక్ విధానం
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రాష్ట్రంలోని అన్ని బస్సులకు లైవ్ ట్రాక్ విధానాన్ని అందుబాటులోకి తె చ్చింది. దీని కోసం లైవ్ ట్రాక్ (డ్రీమ్ స్టెప్) అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడ ఉంది? ఎంత సేపట్లో వస్తుంది? వంటి వివరాలు తెలుసుకోవచ్చు. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్‌తో నడుపుతున్నా ఈ యాప్ ద్వారా ఆర్టీసీకి ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇప్పటివరకు దూర ప్రాంతాలకు వెళ్లే గరుడ, సూపర్ లగ్జరీ, లగ్జరీ బస్సులకు మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉండగా తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా అమర్చారు.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు ఓఆర్‌ఆర్ నిర్మాణంలో చివరి దశ అయిన కండ్లకోయ జంక్షన్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మే 1న ప్రారంభించారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఓఆర్‌ఆర్‌గా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కనుంది.
2004 అక్టోబర్ 19న నాటి ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2006 మే 29న వైయస్‌ఆర్‌తో కలిసి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓఆర్‌ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. 12 ఏళ్లలో మొత్తం 158 కి.మీ. మార్గంను రూ.6,696 కోట్ల వ్యయంతో నిర్మించారు.
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి మూడో ర్యాంకు
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై)కింద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనకు సంబంధించి ఉత్తమ పనితీరు కనబరచిన మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఒడిశా మొదటి స్థానంలోనూ, కేరళ రెండో స్థానంలోనూ నిలిచాయి.

No comments:
Post a Comment