మిథాలీ రాజ్‌కు టీఎస్ ప్రభుత్వం కోటి నజరానామహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మిథాలీకి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. మిథాలీ కోచ్ మూర్తికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
మంగళగిరిలో '' పై డేటా సెంటర్'' ప్రారంభంఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 28న ప్రారంభించారు. పై డేటా సెంటర్స్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల డేటాను కూడా పై డేటా సెంటర్‌లో నిల్వ చేయనున్నారు.
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తెలంగాణ బోనంహైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్డేడియంలో 2,650 మందితో ‘‘బోనం-తెలంగాణ ప్రాణం’’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్‌స అకాడమీ, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కై రా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించాయి. బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మరో సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తాజాగా రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణలో పూర్ణతో పాటు ఆలేరు గురుకుల పాఠశాలకు చెందిన శ్రీవిద్య కూడా ఉన్నారు.
ఏపీ, తెలంగాణలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు కేంద్రం ఓకేతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ అజయ్‌కుమార్ ఈ మేరకు జూలై 31న ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏపీఐఐసీ 500 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన క్లస్టర్‌కు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.340 కోట్లు.
తెలంగాణ ప్రభుత్వం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా.. వీటిలో హైదరాబాద్ సమీపంలో రావిర్యాల వద్ద టీఎస్‌ఐఐసీ 600 ఎకరాల్లో నెల కొల్పనున్న ప్రాజెక్టుకు క్లియరెన్సు వచ్చింది. ప్రాజెక్టు వ్యయం రూ.667 కోట్లు. ఇందులో కేంద్రం రూ.240 కోట్లను గ్రాంటు రూపంలో సమకూర్చనుంది. శంషాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద మహేశ్వరం సైన్‌స పార్క్ ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు పంపింది. దీనికి అనుమతి రావాల్సి ఉంది.
సింగరేణికి కాస్ట్ మేనేజ్‌మెంట్ పురస్కారంసింగరేణి కాలరీస్ కంపెనీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ‘ఎక్స్‌లెన్‌స ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్- 2016 అవార్డు’ లభించింది. ఈ మేరకు జూలై 18న ఢిల్లీలో జరిగిన 14వ జాతీయ స్థాయి అవార్డుల ఉత్సవంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డును స్వీకరించారు. దేశంలోని పరిశ్రమలు, సంస్థలు వ్యయ (కాస్ట్) వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఐసీఏఐ రూపొందించిన నిర్దిష్టమైన సూచనలు, నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నందుకు సింగరేణికి ఈ పురస్కారం లభించింది. సింగరేణికి 2015లో కూడా ఈ అవార్డు దక్కడం విశేషం.
ఆచార్య ఎన్.గోపికి దాశరథి పురస్కారంతెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డాక్టర్ దాశరథి పురస్కారానికి ప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపి ఎంపికయ్యారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా జూలై 22న ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా లక్షా వేయి నూట పదహార్ల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరిస్తారు.
శ్రీకాకుళంలో కిడ్నీ జబ్బుల పరిశోధన కేంద్రంశ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలసి రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్దానం ప్రాంతంలోనే ఎందుకు కిడ్నీ జబ్బులు వస్తాయన్న దానిపై ఐసీఎంఆర్ బృందం పరిశోధన చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుందన్నారు. పరిశోధన కేంద్రానికి ఏటా రూ.5 కోట్లు వ్యయం అవుతుందని ఐసీఎంఆర్ అంచనా వేసిందన్నారు. ఈ సొమ్మును 50 శాతం ఐసీఎంఆర్, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశోధన కేంద్రం ఏర్పాట్లపై ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. కాగా, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు నెలనెలా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.
తెలంగాణ మానవాభివృద్ధి నివేదిక-2017విద్య, వైద్యంతో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదలతో హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక-2017 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో తలసరి ఆదాయం ఏడాదికి రూ.1.04 లక్షలు. పక్కా భవనాలు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నవారు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అధికశాతం.
తలసరి ఆదాయంతెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచింది. నగరవాసుల తలసరి ఆదాయం ఏడాదికి రూ.1,04,587 ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే. రంగారెడ్డి జిల్లాలో పురుషులు రూ.89,973, మహిళలు రూ.55,317 తలసరి ఆదాయం కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఆరోగ్య, విద్య సూచీఆరోగ్యం, విద్య సూచీల్లో హైదరాబాద్ నగరం అగ్రభాగాన నిలిచింది. ఆరోగ్యం విషయంలో 0.888 పాయింట్లు సాధించి తెలంగాణ జిల్లాల్లో టాప్‌లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 0.733 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఇక విద్యాసూచీలో 0.774 పాయింట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. 0.546 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో ఉంది.
అక్షరాస్యతలో..అక్షరాస్యత విషయంలోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో 83.3 శాతం మంది అక్షరాస్యులున్నారు. ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లాలో 75.9 శాతం అక్షరాస్యత నమోదైంది.
హైదరాబాద్‌లో ప్రైవేటు బడులూ అధికమేహైదరాబాద్ జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా 71.6 శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. రెండో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 47 మాత్రమే.
ఆస్పత్రుల్లో ప్రసవాలుఆస్పత్రుల్లో సురక్షిత పరిసరాల్లో ప్రసవాల విషయంలో హైదరాబాద్ నగరం అగ్రభాగాన నిలిచింది. నగరంలో 97.2 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 95.3.
పాఠశాలలూ ఎక్కువేప్రతి 10 చదరపు మీటర్ల పరిధిలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 209.40 పాఠశాలలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 51.11 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది.
పాఠశాలకు హాజరులో రంగారెడ్డి టాప్అత్యధికంగా 99.1 శాతం మంది విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు హాజరవుతుండగా, హైదరాబాద్ 97.4 శాతంతో, నిజామాబాద్ జిల్లా తరువాత మూడో స్థానంలో ఉంది.
సేవారంగ ఆదాయమూ అధికమేనగరంలో సేవారంగం ద్వారా ఆదాయం అధికంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నిలయమైన భాగ్యనగరంలో సేవారంగం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ రంగంలో 2011-12 అంచనాల ప్రకారం రూ.78,755 కోట్ల ఆదాయం వస్తోంది. పరిశ్రమల ద్వారా రూ.14,898 కోట్లు, వ్యవసాయంలో రూ.1,055 కోట్లే లభిస్తోంది. రంగారెడ్డిలో సేవారంగంలో రూ.36,266 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.26,064 కోట్లు, వ్యవసా యంలో రూ.4,515 కోట్లు ఆదాయం వస్తోంది.
కలవరపరుస్తున్న మాతా, శిశు మరణాలునగరంలో ప్రతి వెయ్యి మంది శిశు జననాలకు 20 మంది.. రంగారెడ్డి జిల్లాలో 33 మంది పురుట్లోనే మృత్యువాతపడుతుండడం కలచివేస్తోంది. హైదరాబాద్‌లో ప్రతి లక్షమంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో 71 మంది... రంగారెడ్డిలో 78 మంది మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పక్కాభవనాలు (కాంక్రీటు భవంతులు) విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు నగరంలో 67.3 శాతం, రంగారెడ్డిలో 62.4 శాతం ఉన్నారు.
తెలంగాణలో ప్రజాఫిర్యాదుల కోసం జనహిత ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సంక్షేమ పథకాల దరఖాస్తు కోసం తెలంగాణ ప్రభుత్వం జనహిత పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించింది. మొదట ప్రయోగాత్మకంగా సూర్యాపేట జిల్లాలో ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై ఫిర్యాదులు, అభ్యర్థనలను ప్రత్యేక వెబ్ పోర్టల్, వాట్సాప్, మెయిల్ ఐడీ ద్వారా సంబంధిత అధికారులకు పంపవచ్చు. దరఖాస్తుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు. ఫిర్యాదులపై నిర్ణీత సమయంలోగా స్పందించని అధికారులకు నెగటివ్ మార్కులు ఇస్తారు.
గ్రేడ్-2 మునిసిపాలిటీగా నారాయణ్‌పేట్మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణ్‌పేట్ మునిసిపాలిటీ స్థాయిని గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మునిసిపాలిటీ 2015-16 సంవత్సరంలో రూ.11.47 కోట్ల ఆదాయాన్ని పొంది గ్రేడ్-2 స్థాయి పొందేందుకు అర్హత సాధించింది.
టీఎస్ ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామారాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి కొండం రామకృష్ణారెడ్డి జూలై 12న రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ద్వారా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి 2014 జూన్ 21న నియమితులయ్యారు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. కొత్త అడ్వకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి.
జపాన్ - ఏపీ సంయుక్త సహకార ప్రకటన
అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యోకు, టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలోని ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో విజయవాడలోని ఒక హోటల్‌లో సీఎం జూలై 12న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అంశాల్లో అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
జపాన్-ఏపీ సంయుక్త సహకార ప్రకటన
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 11న ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు.
ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది.
సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పై భాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.
హైదరాబాద్, విశాఖ జోన్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్‌గా అగర్వాల్జీఎస్‌టీ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ (తెలంగాణ) చీఫ్ కమిషనర్‌గా, విశాఖపట్నం జోన్(ఆంధ్రప్రదేశ్) ఇన్‌చార్జి ఛీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్‌టీ చట్టంలోని అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్‌టీపై దేశంలోని 60వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు.
ఏపీ మీదుగా హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే నూతన హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ (నెంబరు 22833, 22834)ను కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు జూలై 13న ప్రారంభించారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి కర్ణాటకలోని కృష్ణరాజపురం వరకు ఈ రైలు నడవనుంది. వారానికి ఒకరోజు మాత్రమే నడిచే ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రం 4.05గంటలకు కృష్ణరాజ పురంలో బయలుదేరి బుధవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుంది.
శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు: చంద్రబాబు
ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం జూలై 17న తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ పార్కులో ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రాధమికంగా నిర్ణయించామని, ఇందుకోసం త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని శ్రీలంకకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లో దేశంలో తొలి రోబో పోలీస్ ప్రపంచంలోనే అరుదైన పోలీస్ రోబో డిజైన్‌ను జూలై 6న తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. రోబోల తయారీలో నూతన ఒరవడి సృష్టిస్తున్న ‘హెచ్‌బోట్స్ రోబోటిక్స్’ వ్యవస్థాపకులు 2 నెలలు శ్రమించి పోలీస్ రోబో డిజైన్‌కు తుది రూపమిచ్చారు. 2017 డిసెంబర్ 31న జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్‌లో పోలీస్ రోబోను ఏర్పాటు చేస్తామని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ సీఈవో కిషన్ వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో మాత్రమే పోలీస్ రోబో ఉందని, ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోను హైదరాబాద్‌లో తామే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల అనుమతితో పోలీస్ రోబోకు యూనిఫాం వేస్తారు. ఒకే చోట ఉంచేందుకు, అటు ఇటు కదిలేందుకు ఈ రోబోకు అవకాశం ఉంటుంది.
‘పోలీస్ రోబో’ ఏం చేస్తుందంటే..
జూబ్లీ చెక్‌పోస్ట్ పరిసరాల ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్‌లను మెయిన్ సర్వర్‌కు పంపిస్తుంది. ఎవరైనా ఫిర్యాదులిస్తే స్వీకరించడంతో పాటు పరిసరాల్లో బాంబులు, అనుమానాస్పద వస్తువులు ఉంటే గుర్తిస్తుంది.
పెనుగొండలో ఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కమాండో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పెనుగొండలోని 244 ఎకరాల ప్రభుత్వ భూమిలో దీనిని స్థాపించనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఉన్న 33 ఎకరాల వక్ఫ్ భూమిలో జాతీయ రైల్వే సెక్యూరిటీ అకాడమీతో పాటు ఆర్‌పీఎఫ్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
కృష్ణా జిల్లాలో ఎన్‌ఐడీఎం ‘దక్షిణ’ క్యాంపస్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా కొండపావులూరులో దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం దేశం మొత్తానికి ఢిల్లీలో ఒక్కచోటే ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఎన్‌ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 12 రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలకు ఇది సేవలందించనుంది.
విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ ఇవ్వడం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. మొదట దీనిని గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే దీనికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఎన్‌ఐడీఎం ఏర్పాటులో జాప్యం అనివార్యమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌ఐడీఎంకు స్థలం కేటాయించింది.
తెలంగాణలో హరిత సైన్యంమొక్కలను నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్ (హరిత సైన్యం) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 5న ఆదేశించారు. మొక్కలు నాటడంతో వదిలేయకుండా వాటిని రక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. హరితహారంపై జూలై 5న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన ఆయన.. జూలై 12న ప్రారంభం కానున్న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దీన్‌దయాళ్ యోజన కింద విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయానికి నోచుకోని పేదలకు రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు.. మీటరు, హౌజ్ వైరింగ్, రెండు ఎల్‌ఈడీ బల్బులు, సర్వీసు వైరును ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాలకు కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్‌సమిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజేవై)’ పథకం కింద డిస్కంలు ఈ కార్యక్రమాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నాయి.
పూర్తిస్థాయి విద్యుదీకరణలో భాగంగా..ప్రస్తుతం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1,200 చెల్లించాలి. దీంతోపాటు మీటరు, సర్వీసు వైరు, ఇంట్లో అవసరమైన వైర్లు, విద్యుత్ పరికరాలు వంటి వాటిని స్వయంగా కొనుక్కోవాలి. ఇది పేదలకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమంలో భాగంగా ‘డీడీయూజేవై’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కేవలం రూ.100 సెక్యూరిటీ డిపాజిట్, రూ.25 దరఖాస్తు రుసుము కలిపి మొత్తం రూ.125 చెల్లిస్తే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారు. రూ.3 వేలు విలువైన విద్యుత్ సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. ఇందులో విద్యుత్ మీటర్, సర్వీస్ వైరుతో పాటు ఇంట్లో ఒక బల్బు, ఫ్యాన్, సాకెట్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బోర్డుతో సహా హౌస్ వైరింగ్, రెండు ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని పేదల ఇళ్లన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్రో సేవలుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సం బంధించిన పలు రంగాల్లో సేవలందించనుంది. ఈ మేరకు విద్య, వ్యవసాయం వంటి పలు రంగాల్లో సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 5న ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఇస్రో సైంటిఫిక్ కార్యదర్శి డాక్టర్ దివాకర్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరా జన్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ‘ఏపీ స్పేస్ ఇన్నోవేషన్‌స అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ను నెలకొల్పనున్నా రు. ఇస్రో, ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో దీని కార్యకలాపాలు కొనసాగుతాయి. వ్యవసాయ సలహాలు, వాతావరణ పరిస్థితులు, జలవనరులు, విపత్తుల నిర్వహణ, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా సత్వర సేవలను ఇస్రో అందిస్తుంది.
మూడో విడత హరితహారం కార్యక్రమంతెలంగాణలో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 12న ప్రారంభించారు. ఈ మేరకు కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటిన కేసీఆర్.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేస్తారు. పర్యావరణ హితం కోసం ’ఫ్రెండ్‌స ఆఫ్ హరితహారం’పేరిట గ్రూపులను తయారు చేస్తారు.
సింగపూర్ ఎంఓయూ అమలుకు కార్యాచరణ కమిటీఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో సింగపూర్ సంస్థ కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ) ఏర్పాటైంది. ఈ మేరకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ జూన్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.
2017 మే 15న సింగపూర్ ప్రభుత్వం సీఆర్‌డీఏ మాస్టర్ డెవలప్‌మెంట్‌కు ఎంఓయూ చేసుకుంది. దీని అమలుకు ఐదుగురు సభ్యులతో కమిటీని వేశారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, పురపాలకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
స్ట్టీరింగ్ కమిటీతో పాటు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇస్తుంది.
సృజనాత్మకతకు టీ-వర్క్స్సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ని అభివృద్ధి చేసుకోవడానికి సదుపాయాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ-వర్క్స్’ పేరుతో నూతన సంస్థను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో-మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పని చేయనుంది.
2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 96 లక్షల టన్నులుతెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో పెరిగింది. 2015-16 వ్యవసాయ సీజన్‌లో 51.45 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, 2016-17 సీజన్‌లో ఏకంగా 96.36 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అందులో వరి 2015-16లో 30.47 లక్షల టన్నులు ఉత్పత్తి జరగ్గా.. 2016-17లో ఏకంగా రెట్టింపు స్థాయిని మించి 63.57 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. అలాగే.. 2016 ఖరీఫ్‌లో 29.18 లక్షల టన్నులు మాత్రమే వరి పంట చేతికి రాగా, రబీలో ఏకంగా 34.39 లక్షల టన్నులు పంట చేతికొచ్చింది. 2015-16లో 2.47 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా, 2016-17లో ఏకంగా 5.29 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది.
వివిధ పంటల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని హోం శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ఈనెల 23న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.70 ఉన్న ధరను రూ.120కి పెంచగా.. పెరిగిన ధరలను థియేటర్లు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.
తెలంగాణలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్తెలంగాణలో 2018 నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, ఈ రంగానికి భారీగా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ‘రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి’పై జూలై 1న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులుఆంధ్రప్రదేశ్‌లో చెట్లు నాటే వారిని ప్రోత్సహించడంలో భాగంగా వృక్ష మిత్ర అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జూలై 1న జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ వనం-మనం అందరి జీవితంలో భాగం కావాలన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యను ప్రోత్సహించడంలో భాగంగా రూ.10 వేలు పింఛను ఇచ్చామని చెప్పారు.

- విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడలకు సుముఖత. రియల్ టైమ్ స్మార్ట్ రీడింగ్ మీటర్ల అమర్చడానికి ముందుకొచ్చిన పుజి ఎలక్ట్రానిక్స్.
- చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన జపాన్ సంస్థ. రాష్ట్రంలో ఇలాంటివి మొత్తం 12 ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన.
- అమరావతిలో డాటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్లాట్‌ఫాం, విపత్తుల నిరోధం, ట్రాఫిక్ వ్యవస్థ, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి విధానం రంగాల్లో జపాన్ తన స్మార్ట్ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇక్కడ క్రీడానగరం, ఎలక్ట్రానిక్ నగరాల అభివృద్ధికి తగ్గ మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తుంది.
- ఫుడ్ వాల్యూ చైన్ అభివృద్ధి చేయడానికి ఏపీ, జపాన్ ప్రభుత్వాల అంగీకారం.
- మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అమరావతిలోని ఎన్‌బీకే ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జపాన్‌కు చెందిన మీడెన్‌షా సంస్థ " జపాన్ ఎండౌడ్ కోర్స్" ప్రారంభిస్తుంది.

పంట
|
2015-16
|
2016-17
|
వరి
|
30.47
|
63.57
|
మొక్కజొన్న
|
17.51
|
26.38
|
తృణధాన్యాలు
|
48.98
|
91.07
|
పప్పుధాన్యాలు
|
2.47
|
5.29
|
వేరుశనగ
|
2.06
|
3.32
|
సోయాబీన్
|
2.52
|
3.23
|
నూనె గింజలు
|
5.79
|
7.13
|
చెరుకు
|
24.05
|
21.55
|
పత్తి
|
37.33
|
29.34
|
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని హోం శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ఈనెల 23న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.70 ఉన్న ధరను రూ.120కి పెంచగా.. పెరిగిన ధరలను థియేటర్లు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.
తెలంగాణలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్తెలంగాణలో 2018 నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, ఈ రంగానికి భారీగా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ‘రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి’పై జూలై 1న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులుఆంధ్రప్రదేశ్‌లో చెట్లు నాటే వారిని ప్రోత్సహించడంలో భాగంగా వృక్ష మిత్ర అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జూలై 1న జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ వనం-మనం అందరి జీవితంలో భాగం కావాలన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యను ప్రోత్సహించడంలో భాగంగా రూ.10 వేలు పింఛను ఇచ్చామని చెప్పారు.
No comments:
Post a Comment